Friday, March 20, 2009

నేను-నా దేశం-లోక్ సత్తా

నేను - నా దేశం

1929 ఎప్రిల్ 8:
భరత మాత ముద్దు బిడ్డలు భగత్ సింగ్, భటకేశ్వర్ దత్ లు బ్రిటీష్ సాంమ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అప్పటి భారత పార్లిమెంటు లొ బాంబులు విసిరారు. పధకం ప్రకారం ఎవరికీ ఎమీ కాలేదు . ద్దరూ పోలీసులకు లొంగిపొయారు. కొర్టు నే విప్లవ ప్రచార వేదిక గా మార్చుకొవాలి అని భగత్ సింగ్ అలా చేసాడు.

1929 మే 7 : డిల్లీ కొర్టు లో కేసు విచారణకు వచ్చింది, భగత్ సింగ్ తను బాంబులు వేయవలసివచ్చి కారణాలను, తన విప్లవ మర్గాన్ని, ఇలా వివరించాడు.
"విప్లవమంటే రక్తపాతం కాదు, వ్యక్తిగత హింస అంతకంటే కాదు, ఈనాటి వ్యవస్తని, దాన్ని కాపాడే శాసనాలను వాటి అధారం గా జరిపే అక్రమాలను అరికట్టడం. ఈనాడు పంటలు పండించే రైతన్న సకుటుంబంగా ఆకలి తో అల్లాడుతున్నాడు, బట్టలు నేసే నేతన్న కు గుడ్డె కరువైంది"

సంఘటన జరిగి 80 సంవత్సరాలయింది, 80 లొ 62
ఎళ్ళు స్వ
రాజ్యం సాగించాం, ఇప్పటికీ మన రైతన్నలు నేతన్నల పరిస్థితి ఏమాత్రం మెరుగయినట్టు లేదు. చాలా సాంప్రదాయ వృతులు పెను సంక్షోబం లో ఉన్నాయి. కొని సమస్యలు ఉంటే అర్దం చేసుకోవచ్చు, కాని నేటికీ పుర్తి స్ధాయి సంక్షోబం లో ఉండడం దారుణం, దేశం లో అత్యధిక మంది ఆధార పడే వృత్తుల పరిస్థితి ఇలా ఉంటే 60 ఏళ్ళ స్వతంత్ర భారతం లో మనం ఏమి సాధించినట్టు. ఉదంతం మన దేశ పరిస్తితులకు ఒక మచ్చు తునక మాత్రమే.

60 ఏళ్ళ లో మనం సాధించింది
శూన్యం అని నేను అనడం లేదు, నిస్సందేహం గా మనం చాలా సమస్యలు పరిష్కరించు కున్నాం, చాలా వృధి చెందాం, కానీ అది మాత్రం చాలదు,
సాధించింది గొరంత సాధించాల్సింది కొండంత. మన వ్యవస్త లొ  తీవ్రమయిన లోపాలు ఉన్నాయి ఉదాహరణకు ,
  • ప్రభుత్వ పాఠశాల లో నాణ్యమయిన విద్య దొరకదు, ఉపాధ్యాయులు చాలా మంది చిత్తశుద్ది తో పని చేయరు, ఎంతగా అంటే వారు చెప్పే బడి కి వాళ్ళ పిల్లలనే పంపలేరు, పంతుళ్ళు పని చేయక మిగిలిని సమయం లో ఎంచక్కా ఎదో ఒక సైడు బిజినెసు చేసుకుంటారు.
  • ప్రభుత్వ వైద్యులు చాలా మంది సర్కరీ ఆస్పత్రి లో కాకుండా వారి ప్రయివేటు క్లీనికులో వారి పని తనాన్ని ప్రదర్శిస్తారు. కొందరు కాంపౌండర్లు, వార్డ్ బాయిలు అయితే నేరుగా రోగులకు ఇక్కడ కాదు డక్టరు గారి ప్రయివేటు క్క్లీనికు కి వెళ్ళి మెరుగయిన సేవలు పొందవలసినది గా హెచ్చరిస్తారు, అక్కడితొ ఆగక ఖరీదయిన వైద్య పరికరాలను పనిగ్గటుకొని ద్వంసం చేస్తారు.
  • బొఫొర్సు, గ్గడి నుండి ఔటర్, డిపెప్ వరకు లెక్కకు మిక్కిలి కుంభకొణాలు వెలుగు లొకి వచ్చాయి, మన ర్యాప్తు సంస్ధలు దశాబ్దాలు-శతాబ్దాలు వీటిని శొధించినా నిజనిర్దారణ జరగదని బుద్ది ఎరిగిన ప్రతి పౌరుడికి తేటతెల్లం. అప్పుడప్పుడూ రాజకీయ నాయకుల అవసరాలకు తగ్గటు సి బీ క్లీన్ చిట్లు ఇస్తుంటుంది. బడా బాబులు వాళ్ళ కాలికి అంటిన మట్టి ని తుడిచే పట్ట లాగా సి బీ ని ఎంతో అర్ధవంతం గా వాడుకుంటున్నారు.
  • బడా రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేతల నుండి సంఘటిత రంగం(organized sector) లొ ఉన్న చిన్న ఉద్యోగుల స్ధాయి వరకు ఆధాయ పన్ను ఎగవేత వారికి సహజం గా వచ్చిన హక్కు లాగా భావిస్తుంటారు, ప్రభుత్వం వారు అధాయ పన్ను మినహాయింపు కొరకు కల్పించిన మార్గాలను అతి సులువు గా దుర్వినియోగం చేసి పన్ను ఎగవేస్తారు, ఇది అందరికీ తెలిసిన రహస్యం, అయినా ప్రభుత్వం మినహాయింపు మర్గాలను దుర్వినియోగం కాకుండా చూడడం కానీ, అది చేత కానప్పుడు వాటి ని ఎతివేయడం గాని అస్సలు చేయదు. కొంత నిరాశావాద దృష్టి తొ ఆలోచించినప్పుడు ప్రభుత్వం వారు ప్రతి పౌరుడికి వారి వారి స్ధాయి లొ దోచుకోవడానికి వేసులుబాటు కల్పించినట్టు గా తొస్తుంది.
  • వోటరు గా నమోదు చేసుకొని వోటరు గుర్తింపు కార్డు పొందడానికి ఇప్పటికి అయిదు సార్లు దరకాస్తు చేసుకున్నాను అయినా ఫలితం శూన్యం, మన తరం వాళ్ళ లాగా కాకుండా వనరుల్ని పొదుపుగా వాడే మా అమ్మ నా ఫొటోలు అన్ని వృధా పోతున్నాయి అని ప్రభుత్వం వారిని శాపనార్ధాలు పెట్టింది. ప్రజాస్వామ్య ప్రక్రియ లొ పాలుపంచుకొవడానికి తొలి మెట్టు వోటు హక్కు, అధి తెచ్చుకోవాలంటే ఇంత రచ్చ, 60 ఏళ్ళ లొ ఏమాత్రం సమస్యలకు తావులేని ఒక క్రమ పద్దతిని ఎందుకు రూపొందించలేకపొయ్యం??
  • MRO, RTO, పోలీస్, న్యాయస్ధానాలు, మునిసిపాలిటీ, ఆదాయ పన్ను, ఇలా ప్రభుత్వ కార్యాలయం లొ మనకు పని ఉన్నట్లయితె, డబ్బుని లేక పలుకుబడి ని కాని ప్రయొగించాలి అవి రెండు లేని పక్షం లో అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అనుకుంటే పగటి కల కంట్టున్నటే, కొరి అశాంతిని తెచ్చుకున్నటే, ప్రభుత్వ యంత్రాంగం సేవా భావన్ని ఎప్పుడో విడనాడింది( అసలు ఉంటే కదా పోవడానికి అని కూడా అనచ్చు),
  • ఇలా చెప్పుకుంటూ పోతే చదవడానికి మీకు ఓపిక న్నా టైపు చేయలేక నా చేతులు పడిపోవడం ఖాయం.
పై పేర్కొన్నవన్నీ తీవ్రమయిన వ్యవస్తీకృత లొపాలు, మరి దీని వల్ల లా-నష్టాలు ఎవరికి? రాజకీయ నాయకులు, బాగా డబ్బు ఉన్నవారు అత్యంత లాభం పొందుతారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్ధులం గా చాలా లాభాన్నే పొందుతారు, ఒక ప్రయివేటు రంగ ద్యోయోగి ఆదాయ పన్ను ఎగవేత వంటి కొన్ని లాభాలు పొందినా, విద్య లొ వైద్యం లొ ఇతరత్ర అవినీతి, పారదర్శకత(transparency) లేమి వలన బాగా నష్టపోతున్నాడు, కాని మాత్రం డబ్బు పరపతి లెని 80% మంది పౌరులు తీవ్రం గా పీడించబడుతున్నారు. దురద్రుష్టం ఎమిటంటే 80% లొ చాలా మందికి వారు పీడించబడుతున్న సంగతే తెలియదు, వీరు ప్రభుత్వం అంటే ఇంతే అనుకుంటున్నారు.

ఎందుకు ఇలా ఉందీ వ్యవస్త? ఎందుకంటే దీ
న్ని ష్టు ఇండియా కంపెనీ వారు సుమారు 200 ఎళ్ళ క్రితం తయారు చేసారు కాబట్టి. ఎందుకంటే ష్టు ఇండియా కంపెని వారు వ్యవస్త ని భారత దేశాన్ని పరిపాలించడానికి తయారు చేసారు కాబట్టి, సేవ చేయడానికి తయారు చేసింది కాదు కాబట్టి. మనవాళ్ళు పై పైన అక్కడా ఇక్కడా మార్పులు చేర్పులు చేసినా మౌలికం గా ఇంకా దాన్నే వాడుతున్నారు కాబట్టి.

ఇంకో విషయం, వ్యవస్త లొ అందరూ అవినీతి పరులు అనడం నా ఉద్దేశం కాదు, ఇప్పటికీ నాకు తెలిసిన ఒక టీచరమ్మ ఉంది, ఆమె పని చెసే సర్కారి బడి లొ ర్ధిక స్తోమత బాగా ఉన్న పిల్లలు కుడా వస్తారు, ఈదేమిటి మీ పిల్లలిని ప్రయివేటు కన్వెంట్ కు ఎందుకు పంపడం లేదు అని తల్లి దండ్రుల ను అడిగితే, టీరమ్మ ఉన్నంత కాలం అవసరం లేదు అన్నారట. అలాగే నాకు తెలిసిన ఒక ప్రభుత్వ వైద్యుడు ఒకాయన న్నాడు, ఆయన మొత్తం రాయలసీమ లొనే ఒక విభాగం లొ నిపుణుడు, ఆయనకు ఒక ప్రయివేటు క్లీనికు కూడా ఉంది, అయినా అయన ప్రభుత్వ ఆస్పత్రి లొ అత్యంత చిత్తశుద్ది తొ పని చేస్తారు,రిటయిరుమెంటు దగ్గర పడినా ఇంకా సైకిలు మీద తిరుగుతారు. ఇలాంటి వారు మనకు అక్కడక్కడా కనపడి అశ్చర్య పరుస్తుంటారు, వీరందరు వారి వ్యక్తిగతమయిన నిజాయితీ,విలువలు,సమగ్రత వలన అలా పని చేస్తున్నారే కాని వ్యవస్తీకృతం గా తప్పక చేయవలసిన అవసరం ఉండి కాదు. వ్యవస్తను మనం ఎంత గా బలొపేతం/మార్పులు చేయాలంటే నిజాయితీ పరులే కాదు ప్రతి సగటు మనిషి వారి బాధ్యతలను సరిగా నిర్వర్తించాలి. ఇది ఎలా చేయచ్చొ ఒక చిన్న దాహరణ, ప్రభుత్వ పాఠశాల లొ విద్య నాణ్యత పెంచడానికి, బడి లొ చదివే పిల్లల తలి దండ్రులకు టీర్ల ఎంపిక/తీసివెత, నిధుల ఖర్చు మొదలగు కొన్ని అధికారాలు ప్రజాస్వామ్య పద్దతి లొ కట్టబెట్టచు, దీని ద్వార ఉపాధ్యాయుల లొ జవాబుదారి తన్నాని వారు వద్దూ అన్నా పెంచవచ్చు, దీని వల్ల ఇతర సమస్యలు ఉన్నా, ప్రతి తల్లి తండ్రి తన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వారికి మంచి విద్య అందాలి అనుకుంటాడు కాబట్టి మార్పు మన విద్యను సంస్కరించడానికి ఒక మౌలిక మార్పు అనవచ్చు.

అభివృధ్ధి చేందిన దేశాలలొ వ్యవస్త జనరంజకం గా నిత్యం సంస్కరింపబడుతూ ఉంటుంది. దేశాలలొ మన భారతీయులు స్ధిర పడడానికి ముఖ్య కారణం అదే.

మన వ్యవస్త ఇంతగా కుళ్ళిపొయినా, మన రాజకీయ పార్టీలు, వ్యవస్తను బాగుచేస్తం లాంటి అసందర్భ ప్రేలాపనలు చేయకుండా మ్యానిఫెస్టొలు రూపొందించుకొని ముందు కు పోతున్నాయి.కాని నా మట్టుకు నేను మన దేశం లొ నిజమయిన అభివృధ్ధి సాధించాలి అంటే మన వ్యవస్త లొ మౌలికమయిన మార్పులు రావాలి, దీనికి ఆటగాళ్ళు మారితే సరిపోదు ఆట నియమాలు మారాలి అని గట్టి గా నముతున్నాను. సాధ్య-ఆసాధ్యలు పక్కన పెడితే పనిని లోక్ సత్త ఒకటే చేయడానికి పూనుకుంది.

ఆకరిగ రంగడిది ఒకేఒక విన్నపం, చదువు కున్న దేశ భక్తి ఉన్న, కుల, మత, ప్రాంతీయ, భషా దురభిమానం లేని ప్రతి భారతీయుడు
లోక్ సత్తా ను పరిశీలించి వారికి చ్చితే ఉద్యమం లొ భాగం కవాలి, ఇంకా నాళి లోకి తీసుకువెళ్ళాలి.

లోక్ సత్తా

లోక్ సత్తా మౌలికమయిన మార్పులు ఎలా తెస్తుందో తెలుసుకొవాలి అంటే వారి 50 హామీల పత్రాన్ని చదివితే సరిపొతుంది.

కాని ఇంకా వినొదాత్మకమయిన విదానం జే పే గారి ప్రసంగాలు, ఇంటర్యులు వినడం, నేను చూసిన నాకు నచ్చిన ప్రసంగాలను, ఇంటర్యు లను ఇక్కడ పొందుపరిచాను.



1.
ప్రసంగం, బొంబాయి విశ్వవిద్యాలయం లొ.
గమనిక : శబ్దం కొంచెం తక్కువగా అనిపిస్తుంది హెడ్ ఫొన్లు వాడండీ




2.
ఇంటర్యు , NTV లొ 7 pm, లైవ్ షౌ.





3.
ఇంటర్యు ,TV9 close encounter.





4.
ఇంటర్యు , DD న్యుస్ కరన్ థాపర్ తొ.



కొంత మార్పు గా ఉంటుంది కరన్ థపర్
vs YSR ఇంటర్యు చూడంది.




5.
ఇంటర్యు , జెమిని టీ.వీ గెస్ట్ అవర్.





6
. ప్రసంగం, సాక్షి టీ.వీ ప్రారంభొత్సవం.




7
. ఇంటర్యు, సాక్షి టీ.వీ ముఖాముఖి





8.
తెలుగు దేశం పార్టీ వారి నగదు బదిలి ఉచిత టీ.వీ హామి పై జే పీ గారి వ్యఖ్యలు.




9.
ప్రసంగం, లోక్ సత్తా శంకారావం, లోక్ సత్తా పార్టీ విధి విధానలను జే పీ గారు ఇక్కడ వివరించారు.





10.
లోక్ సత్తా విద్యా విధానం.