Friday, March 20, 2009

నేను-నా దేశం-లోక్ సత్తా

నేను - నా దేశం

1929 ఎప్రిల్ 8:
భరత మాత ముద్దు బిడ్డలు భగత్ సింగ్, భటకేశ్వర్ దత్ లు బ్రిటీష్ సాంమ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అప్పటి భారత పార్లిమెంటు లొ బాంబులు విసిరారు. పధకం ప్రకారం ఎవరికీ ఎమీ కాలేదు . ద్దరూ పోలీసులకు లొంగిపొయారు. కొర్టు నే విప్లవ ప్రచార వేదిక గా మార్చుకొవాలి అని భగత్ సింగ్ అలా చేసాడు.

1929 మే 7 : డిల్లీ కొర్టు లో కేసు విచారణకు వచ్చింది, భగత్ సింగ్ తను బాంబులు వేయవలసివచ్చి కారణాలను, తన విప్లవ మర్గాన్ని, ఇలా వివరించాడు.
"విప్లవమంటే రక్తపాతం కాదు, వ్యక్తిగత హింస అంతకంటే కాదు, ఈనాటి వ్యవస్తని, దాన్ని కాపాడే శాసనాలను వాటి అధారం గా జరిపే అక్రమాలను అరికట్టడం. ఈనాడు పంటలు పండించే రైతన్న సకుటుంబంగా ఆకలి తో అల్లాడుతున్నాడు, బట్టలు నేసే నేతన్న కు గుడ్డె కరువైంది"

సంఘటన జరిగి 80 సంవత్సరాలయింది, 80 లొ 62
ఎళ్ళు స్వ
రాజ్యం సాగించాం, ఇప్పటికీ మన రైతన్నలు నేతన్నల పరిస్థితి ఏమాత్రం మెరుగయినట్టు లేదు. చాలా సాంప్రదాయ వృతులు పెను సంక్షోబం లో ఉన్నాయి. కొని సమస్యలు ఉంటే అర్దం చేసుకోవచ్చు, కాని నేటికీ పుర్తి స్ధాయి సంక్షోబం లో ఉండడం దారుణం, దేశం లో అత్యధిక మంది ఆధార పడే వృత్తుల పరిస్థితి ఇలా ఉంటే 60 ఏళ్ళ స్వతంత్ర భారతం లో మనం ఏమి సాధించినట్టు. ఉదంతం మన దేశ పరిస్తితులకు ఒక మచ్చు తునక మాత్రమే.

60 ఏళ్ళ లో మనం సాధించింది
శూన్యం అని నేను అనడం లేదు, నిస్సందేహం గా మనం చాలా సమస్యలు పరిష్కరించు కున్నాం, చాలా వృధి చెందాం, కానీ అది మాత్రం చాలదు,
సాధించింది గొరంత సాధించాల్సింది కొండంత. మన వ్యవస్త లొ  తీవ్రమయిన లోపాలు ఉన్నాయి ఉదాహరణకు ,
  • ప్రభుత్వ పాఠశాల లో నాణ్యమయిన విద్య దొరకదు, ఉపాధ్యాయులు చాలా మంది చిత్తశుద్ది తో పని చేయరు, ఎంతగా అంటే వారు చెప్పే బడి కి వాళ్ళ పిల్లలనే పంపలేరు, పంతుళ్ళు పని చేయక మిగిలిని సమయం లో ఎంచక్కా ఎదో ఒక సైడు బిజినెసు చేసుకుంటారు.
  • ప్రభుత్వ వైద్యులు చాలా మంది సర్కరీ ఆస్పత్రి లో కాకుండా వారి ప్రయివేటు క్లీనికులో వారి పని తనాన్ని ప్రదర్శిస్తారు. కొందరు కాంపౌండర్లు, వార్డ్ బాయిలు అయితే నేరుగా రోగులకు ఇక్కడ కాదు డక్టరు గారి ప్రయివేటు క్క్లీనికు కి వెళ్ళి మెరుగయిన సేవలు పొందవలసినది గా హెచ్చరిస్తారు, అక్కడితొ ఆగక ఖరీదయిన వైద్య పరికరాలను పనిగ్గటుకొని ద్వంసం చేస్తారు.
  • బొఫొర్సు, గ్గడి నుండి ఔటర్, డిపెప్ వరకు లెక్కకు మిక్కిలి కుంభకొణాలు వెలుగు లొకి వచ్చాయి, మన ర్యాప్తు సంస్ధలు దశాబ్దాలు-శతాబ్దాలు వీటిని శొధించినా నిజనిర్దారణ జరగదని బుద్ది ఎరిగిన ప్రతి పౌరుడికి తేటతెల్లం. అప్పుడప్పుడూ రాజకీయ నాయకుల అవసరాలకు తగ్గటు సి బీ క్లీన్ చిట్లు ఇస్తుంటుంది. బడా బాబులు వాళ్ళ కాలికి అంటిన మట్టి ని తుడిచే పట్ట లాగా సి బీ ని ఎంతో అర్ధవంతం గా వాడుకుంటున్నారు.
  • బడా రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేతల నుండి సంఘటిత రంగం(organized sector) లొ ఉన్న చిన్న ఉద్యోగుల స్ధాయి వరకు ఆధాయ పన్ను ఎగవేత వారికి సహజం గా వచ్చిన హక్కు లాగా భావిస్తుంటారు, ప్రభుత్వం వారు అధాయ పన్ను మినహాయింపు కొరకు కల్పించిన మార్గాలను అతి సులువు గా దుర్వినియోగం చేసి పన్ను ఎగవేస్తారు, ఇది అందరికీ తెలిసిన రహస్యం, అయినా ప్రభుత్వం మినహాయింపు మర్గాలను దుర్వినియోగం కాకుండా చూడడం కానీ, అది చేత కానప్పుడు వాటి ని ఎతివేయడం గాని అస్సలు చేయదు. కొంత నిరాశావాద దృష్టి తొ ఆలోచించినప్పుడు ప్రభుత్వం వారు ప్రతి పౌరుడికి వారి వారి స్ధాయి లొ దోచుకోవడానికి వేసులుబాటు కల్పించినట్టు గా తొస్తుంది.
  • వోటరు గా నమోదు చేసుకొని వోటరు గుర్తింపు కార్డు పొందడానికి ఇప్పటికి అయిదు సార్లు దరకాస్తు చేసుకున్నాను అయినా ఫలితం శూన్యం, మన తరం వాళ్ళ లాగా కాకుండా వనరుల్ని పొదుపుగా వాడే మా అమ్మ నా ఫొటోలు అన్ని వృధా పోతున్నాయి అని ప్రభుత్వం వారిని శాపనార్ధాలు పెట్టింది. ప్రజాస్వామ్య ప్రక్రియ లొ పాలుపంచుకొవడానికి తొలి మెట్టు వోటు హక్కు, అధి తెచ్చుకోవాలంటే ఇంత రచ్చ, 60 ఏళ్ళ లొ ఏమాత్రం సమస్యలకు తావులేని ఒక క్రమ పద్దతిని ఎందుకు రూపొందించలేకపొయ్యం??
  • MRO, RTO, పోలీస్, న్యాయస్ధానాలు, మునిసిపాలిటీ, ఆదాయ పన్ను, ఇలా ప్రభుత్వ కార్యాలయం లొ మనకు పని ఉన్నట్లయితె, డబ్బుని లేక పలుకుబడి ని కాని ప్రయొగించాలి అవి రెండు లేని పక్షం లో అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అనుకుంటే పగటి కల కంట్టున్నటే, కొరి అశాంతిని తెచ్చుకున్నటే, ప్రభుత్వ యంత్రాంగం సేవా భావన్ని ఎప్పుడో విడనాడింది( అసలు ఉంటే కదా పోవడానికి అని కూడా అనచ్చు),
  • ఇలా చెప్పుకుంటూ పోతే చదవడానికి మీకు ఓపిక న్నా టైపు చేయలేక నా చేతులు పడిపోవడం ఖాయం.
పై పేర్కొన్నవన్నీ తీవ్రమయిన వ్యవస్తీకృత లొపాలు, మరి దీని వల్ల లా-నష్టాలు ఎవరికి? రాజకీయ నాయకులు, బాగా డబ్బు ఉన్నవారు అత్యంత లాభం పొందుతారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్ధులం గా చాలా లాభాన్నే పొందుతారు, ఒక ప్రయివేటు రంగ ద్యోయోగి ఆదాయ పన్ను ఎగవేత వంటి కొన్ని లాభాలు పొందినా, విద్య లొ వైద్యం లొ ఇతరత్ర అవినీతి, పారదర్శకత(transparency) లేమి వలన బాగా నష్టపోతున్నాడు, కాని మాత్రం డబ్బు పరపతి లెని 80% మంది పౌరులు తీవ్రం గా పీడించబడుతున్నారు. దురద్రుష్టం ఎమిటంటే 80% లొ చాలా మందికి వారు పీడించబడుతున్న సంగతే తెలియదు, వీరు ప్రభుత్వం అంటే ఇంతే అనుకుంటున్నారు.

ఎందుకు ఇలా ఉందీ వ్యవస్త? ఎందుకంటే దీ
న్ని ష్టు ఇండియా కంపెనీ వారు సుమారు 200 ఎళ్ళ క్రితం తయారు చేసారు కాబట్టి. ఎందుకంటే ష్టు ఇండియా కంపెని వారు వ్యవస్త ని భారత దేశాన్ని పరిపాలించడానికి తయారు చేసారు కాబట్టి, సేవ చేయడానికి తయారు చేసింది కాదు కాబట్టి. మనవాళ్ళు పై పైన అక్కడా ఇక్కడా మార్పులు చేర్పులు చేసినా మౌలికం గా ఇంకా దాన్నే వాడుతున్నారు కాబట్టి.

ఇంకో విషయం, వ్యవస్త లొ అందరూ అవినీతి పరులు అనడం నా ఉద్దేశం కాదు, ఇప్పటికీ నాకు తెలిసిన ఒక టీచరమ్మ ఉంది, ఆమె పని చెసే సర్కారి బడి లొ ర్ధిక స్తోమత బాగా ఉన్న పిల్లలు కుడా వస్తారు, ఈదేమిటి మీ పిల్లలిని ప్రయివేటు కన్వెంట్ కు ఎందుకు పంపడం లేదు అని తల్లి దండ్రుల ను అడిగితే, టీరమ్మ ఉన్నంత కాలం అవసరం లేదు అన్నారట. అలాగే నాకు తెలిసిన ఒక ప్రభుత్వ వైద్యుడు ఒకాయన న్నాడు, ఆయన మొత్తం రాయలసీమ లొనే ఒక విభాగం లొ నిపుణుడు, ఆయనకు ఒక ప్రయివేటు క్లీనికు కూడా ఉంది, అయినా అయన ప్రభుత్వ ఆస్పత్రి లొ అత్యంత చిత్తశుద్ది తొ పని చేస్తారు,రిటయిరుమెంటు దగ్గర పడినా ఇంకా సైకిలు మీద తిరుగుతారు. ఇలాంటి వారు మనకు అక్కడక్కడా కనపడి అశ్చర్య పరుస్తుంటారు, వీరందరు వారి వ్యక్తిగతమయిన నిజాయితీ,విలువలు,సమగ్రత వలన అలా పని చేస్తున్నారే కాని వ్యవస్తీకృతం గా తప్పక చేయవలసిన అవసరం ఉండి కాదు. వ్యవస్తను మనం ఎంత గా బలొపేతం/మార్పులు చేయాలంటే నిజాయితీ పరులే కాదు ప్రతి సగటు మనిషి వారి బాధ్యతలను సరిగా నిర్వర్తించాలి. ఇది ఎలా చేయచ్చొ ఒక చిన్న దాహరణ, ప్రభుత్వ పాఠశాల లొ విద్య నాణ్యత పెంచడానికి, బడి లొ చదివే పిల్లల తలి దండ్రులకు టీర్ల ఎంపిక/తీసివెత, నిధుల ఖర్చు మొదలగు కొన్ని అధికారాలు ప్రజాస్వామ్య పద్దతి లొ కట్టబెట్టచు, దీని ద్వార ఉపాధ్యాయుల లొ జవాబుదారి తన్నాని వారు వద్దూ అన్నా పెంచవచ్చు, దీని వల్ల ఇతర సమస్యలు ఉన్నా, ప్రతి తల్లి తండ్రి తన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వారికి మంచి విద్య అందాలి అనుకుంటాడు కాబట్టి మార్పు మన విద్యను సంస్కరించడానికి ఒక మౌలిక మార్పు అనవచ్చు.

అభివృధ్ధి చేందిన దేశాలలొ వ్యవస్త జనరంజకం గా నిత్యం సంస్కరింపబడుతూ ఉంటుంది. దేశాలలొ మన భారతీయులు స్ధిర పడడానికి ముఖ్య కారణం అదే.

మన వ్యవస్త ఇంతగా కుళ్ళిపొయినా, మన రాజకీయ పార్టీలు, వ్యవస్తను బాగుచేస్తం లాంటి అసందర్భ ప్రేలాపనలు చేయకుండా మ్యానిఫెస్టొలు రూపొందించుకొని ముందు కు పోతున్నాయి.కాని నా మట్టుకు నేను మన దేశం లొ నిజమయిన అభివృధ్ధి సాధించాలి అంటే మన వ్యవస్త లొ మౌలికమయిన మార్పులు రావాలి, దీనికి ఆటగాళ్ళు మారితే సరిపోదు ఆట నియమాలు మారాలి అని గట్టి గా నముతున్నాను. సాధ్య-ఆసాధ్యలు పక్కన పెడితే పనిని లోక్ సత్త ఒకటే చేయడానికి పూనుకుంది.

ఆకరిగ రంగడిది ఒకేఒక విన్నపం, చదువు కున్న దేశ భక్తి ఉన్న, కుల, మత, ప్రాంతీయ, భషా దురభిమానం లేని ప్రతి భారతీయుడు
లోక్ సత్తా ను పరిశీలించి వారికి చ్చితే ఉద్యమం లొ భాగం కవాలి, ఇంకా నాళి లోకి తీసుకువెళ్ళాలి.

లోక్ సత్తా

లోక్ సత్తా మౌలికమయిన మార్పులు ఎలా తెస్తుందో తెలుసుకొవాలి అంటే వారి 50 హామీల పత్రాన్ని చదివితే సరిపొతుంది.

కాని ఇంకా వినొదాత్మకమయిన విదానం జే పే గారి ప్రసంగాలు, ఇంటర్యులు వినడం, నేను చూసిన నాకు నచ్చిన ప్రసంగాలను, ఇంటర్యు లను ఇక్కడ పొందుపరిచాను.



1.
ప్రసంగం, బొంబాయి విశ్వవిద్యాలయం లొ.
గమనిక : శబ్దం కొంచెం తక్కువగా అనిపిస్తుంది హెడ్ ఫొన్లు వాడండీ




2.
ఇంటర్యు , NTV లొ 7 pm, లైవ్ షౌ.





3.
ఇంటర్యు ,TV9 close encounter.





4.
ఇంటర్యు , DD న్యుస్ కరన్ థాపర్ తొ.



కొంత మార్పు గా ఉంటుంది కరన్ థపర్
vs YSR ఇంటర్యు చూడంది.




5.
ఇంటర్యు , జెమిని టీ.వీ గెస్ట్ అవర్.





6
. ప్రసంగం, సాక్షి టీ.వీ ప్రారంభొత్సవం.




7
. ఇంటర్యు, సాక్షి టీ.వీ ముఖాముఖి





8.
తెలుగు దేశం పార్టీ వారి నగదు బదిలి ఉచిత టీ.వీ హామి పై జే పీ గారి వ్యఖ్యలు.




9.
ప్రసంగం, లోక్ సత్తా శంకారావం, లోక్ సత్తా పార్టీ విధి విధానలను జే పీ గారు ఇక్కడ వివరించారు.





10.
లోక్ సత్తా విద్యా విధానం.


15 comments:

  1. Naku politics gurinchi sariga teliyadu..kani JP qualification and tanu party loki teesukovadaniki anusarinche vidhan nachchai naku..

    Na friend okadu ila comment chesadu...

    JP poti chesina niyojaka vargam nundi telugu desam party strong opponent ni pettaledata..and JP telugu desam meeda migilina party la meeda ichchinanni vimarsalu cheyadata..since JP worked under NTR when he was CM.

    Deeniki mee daggara emina clarification unda..

    ReplyDelete
  2. Analysis chaala baagundi....

    I am hoping that Loksatta will win and make a difference.....

    ReplyDelete
  3. శ్రీనాధ్,
    జే పీ గారు ఐ ఎ యస్ అధికరిగా ఉన్నపుడు రామారావు గారి దగ్గర, లోక్ సత్తా సామాజిక సంస్ద స్తాపించిన తరువాత సొనియా గాంధీ గారి అధ్యక్షతన జాతీయ అబివృధి సంఘం లొ కూడా పని చేసారు, ఉన్న వ్యవస్తలొనే మార్పు తేవాలని చూసారు ఇక అది కుదరదు అని రూడీ అయిన తరువాత, రాజకీయ పక్షం స్తాపించరు.

    లోక్ సత్త ద్రుష్టి లొ అన్ని సంప్రదాయ పార్టిలు ఒకటే, అలాగె ఆ పార్టిలలొ నాయకులను వ్యక్తిగత గా దూషించడనికి బహు దూరం, ఎందుకంటె ప్రస్తుత పరిస్తితి కి కారణం మన నాయకులు కాదు, నిస్సందేహంగా నిద్ర వీడని మనమే.

    పవన్,
    నీ కితాబు కి ధన్యుడ్ని, నీ లాంటీ ఉత్సహవంతుల అవసరం లోక్ సత్త కు ఉంది రా.

    ReplyDelete
  4. Mee nunchi nenu ilanti oka blog ni oohinchaledu..tappu ga anukokandi, naa uddesyam, meeru samajam loni lotu patla gurinchi manchi avagahana unna vyakthi ga telusu, kaani intha chakkati bhava vyakthikarana unna vishayam naku teliyadu, anduku modataga meeku kruthagnathalu.
    Ika pote mee blog lo inkonni vishaylu pondu parachi unte bavundedi. Meeru cheppinattu ga chaduvukunna, kula,mata,bhasha, prantheeya durabhimanam leni vyakthi ga Lok satta lo ela bhagam avvali? anduku anusarinchalsina vidhaanalu enti? Lok satta nu Janavali loki ela teesukelladam? Meeru pina cheppina amshalanu samanya prajalaku artham ayyela ela cheppali? Ivanni kooda cheppi unte bavundedemo.

    Ippatlo rajakeeyalu anevi dhanam tho mudipadi unnayi ane vishayam samanya prajalaku kooda telisina vishaym,mari prajalanu ee apoha nundi Lok satta bayataku teesukuravadaniki lok satta daggara edina pranalika unda? Rashtra rajakeeyalanu samoola prkshalana cheyadam Lok satta valla sadhyamavutunda? Oka vela avutundi anukonna inka entha kalam pattochu? Ilanti enno prshanlau samanya prajalaje kakunda andari madi lo medulutunna prashanalu. Ilanti prashnallantiki samadhanam kanu choopu mera lo kanipinchinappudu Lok satta oka prabhanjanam avutundi ani cheppadam lo sandeham ledu.

    Chivari Prashna: (Nenu naa senhutini nundi vinnadi)"Aanadu NTR ni chandra babu naidu gadde dimipna udantham lo(Vaisrai hotel udantham) JP patra kooda cheppukodaggadi" Deeniki mee daggara edina samadhanam unda?

    Ramnath.

    ReplyDelete
  5. Tingu Ranga.. Nee blog aasaantam chadivaanu.
    Good initiative taken, naa abhinandanalu.
    Nee bhaava vyakteekarana baagundi. Kaani nee muginpu naaku nachaledu.

    Paina nuvvu prastutinchina samasyalaku samadhanam just Loksatta lo cherite saripodu kada, I feel loksatta is just an option before that mundu manam maarali, mana bhadyatalanu sakramam ga nirvahistu maarpu nu kore loksatta laanti vaarini protsahinchali. Prati yuvakudu vaari vaari paridhilo ilanti manchi bhavalanu protsahistu marpu teesuku raagaligite...
    raaboye rojulu manam kalalu kantunna Nava yuva swarna Bharatavanive anatam lo atisayokthi ledu.... Idi just naa abhiprayam maatrame..... you can take this as pinch of salt while you are posting your next blog.

    Expecting more from you this kind of stuff in coming days,.

    Ika comments vishayaaniki vaste, chaala glammer mistakes vunnai, post chese mundu proof reading cheste baaguntundi. Ika mundu ee vishayamlo jaagratha vahistavani aasistunnanu.

    Prastutaniki inte....

    Saregaani elections heat tagginda? predictions ela vunnai? Congress? TDP?
    PRP ki enni vastai manam anukunnatlu 40 vastaya???
    Kookatpally lo Mana naayakudu JP paristhiti ela vundi?
    Adi kaaka inka vere chotla edaina geliche avakaasam vunda?

    ~Rajesh

    ReplyDelete
  6. I agree with you and I read complete story..Very nice and in Dance india dance style, Naveen ka salam to Ashok sir J

    Ashok sir,Tingu rangadu profile matram Hebrew lone display avutondi edo okati chesi mana language loki convert cheyandi

    -Naveen

    ReplyDelete
  7. Hi sir,

    Nenu mee blog chadivanu,ati takkuva matallone clear ga complete ga vyavasta goorchi andulo lopala goorchi cheepi,daniki LOKSATTA emi cheyyabotundi and prati okkaru(as a common man ga) emi cheyyalo chepparu. It’s really good.



    Guys: I recommend all of you please spend 5 mins of your time and read it.




    Regards,
    Dhanunjaya G.

    ReplyDelete
  8. రాం నాధ్, రజెష్,
    మీ ప్రసంసలకు ధన్యుడిని.
    ఊరికే లోక్ సత్తా లొ చేరితే అస్సలు సరిపొదు.

    మొదటిగా, ఈ దేశం ఇంతే దీనిని ఎవ్వరూ మార్చలేరు అనే నిరాశావాద దురక్పదానికి స్వస్తి చెప్పలి, సరిగా ఇదే దురక్పదం తొ నిద్రానావస్త లొ ఉన్న జనాభా (ముఖ్యం గా మన నాన్నలు, ఇంకా మనకు తెలిసిన ఎందరొ) ని నిద్ర లేపాలి, మనం అధమం గా చేయవలసినది ఇధి. ఇందుకు కావల్సిన అవగహన మనకు ఉందని అనుకుంటున్నాను,

    లోక్ సత్త లొ మీరు క్రియాశేల పాత్ర పొషించచ్చు, అంత ఉత్సాహం, సమయం వగైరలు లెవు అనుకుంటే, విరాళం ఇవ్వచు.

    ఉదహరణకు మేము ఏంచేసామొ చూడండి.
    1. 30 వేల రొకం విరాళం గా ఇచ్చాం.
    2. ఎన్నికల ముందు రెండు వారంతాలు, లింగం పల్లి నియొజికవర్గం లొ ప్రచారం లొ పల్గొనాం.
    3. ఎన్నికల రొజున లింగం పల్లి లొ ఒక బూత్ లో చీటీలు రాసాము
    4. నిన్న లోక్ సత్త లొ ఒక పెద్ద తలకాయను కలిసాము పార్టీ నిర్మానం లొ ఇంకా చేయవలసినది ఇంకా చాలా ఉంధి అని తెలుసుకున్నాము, అలా ముందుకు పొతున్నాము..చూదం!!

    మీరు బెంగుళూరు లో ఉన్నందున అవన్ని చేయలేరేమొ, మిమల్ని ఎలా బాగస్వాముల్ని చేయగలమొ చూదాం!!

    ఇక లోక్ సత్తా పూర్తి స్తాయి విప్లవం ఎప్పుడు సాదిస్తుంది, ప్రతి పౌరుడిని ఎప్పుడు చేరుతుంది, ఇలాంటివి పార్టీ కే వదిలేదాం, మన పరిధి లొ ఉన్నవి మనం చేదం ఎమంటారు??

    టింగు రంగడు.

    ReplyDelete
  9. nenu meru rasindhi chadivanu.me blog lo unna samacharam challa bagundi.....samajam lo marpu kosam nanu oka karmikudu ni loksatta to pani chestanu.......loksatta oka party kadu mana samajani bagu cheya daniki vachina ok viplavam.........jai loksatta.....

    ReplyDelete
  10. Actually i am very eager to prepare some posts on education system. but i am busy with other. we should not see total fault from teachers side, i am not at all supporting teachers but the biggest failure in our country is 1000% education system. thanks for ur comment on FERROR with good enquiry.

    ReplyDelete
  11. జివని గారు,

    అవును విద్యా విదానం నిర్వీర్యం గా ఉండడం మన అతి పేద వైఫల్యం.

    మీ టపా కొసం ఎదురు చూస్తాను..

    ReplyDelete
  12. రంగా గారికి, మీరు రాసిన వాటితో ఏకీభవించని వారు ఎవరూ వుండరు. కానీ మీ పరిష్కార మార్గంగా ఎంచుకున్న లోక్సత్తా కూడా ఒక పార్లమెంటరీ పంధను ఎంచుకున్నపార్టీయే. ప్రస్తుత మన వ్యవస్త బ్రిటిష్ వాడు విదిలించిన వాటికి కొనసాగింపుగా మీరు గుర్తించారు. అలాగే మనం ఇప్పటికీ కామన్ వెల్త్ దేసాలకూటమిలో సభ్యులమే. అంటె ఇప్పటికీ బ్రితిష్ రాజరికానికి లోబడి వున్నవాళ్ళమే. మన దాస్య సృంఖలాలు ఏమీ తెగిపోలేదు. జస్ట్ నాయకత్వపు రంగు మారింది. ఈనాడు పూర్వంలా వలస రాజ్యాలకోసం వాళ్ళు తగువులు పడరు. మన ఆర్ధిక వ్యవస్థను కొల్లగొట్టేందుకు ప్రపంచ బ్యాంకు వంటి వాటి ద్వారా మన మూలుగును పీల్చి పిప్పిచేసి వారి అధీనంలోకి పోయేట్లు చేస్తున్నారు. మన ప్రధాన మంత్రి గారు ముందు వారి జీతగాడే. మొన్నటివరకు వున్న మన ఆర్ధిక మంత్రి కూడా ఆకోవలోని వాడే. వ్యవస్త ఉపిరితల రంగాలలో మార్పు తీసుకు రావడానికి నీతి పాఠాలు చెపుతున్న సూటూ బూటూ పార్టీ లోక్ సత్తా ఇంతకంటె ముందు పాత జయప్రకాష్ నారాయన వంటి వారు స్తాపించిన జనతా పార్టీ కున్న ప్రణాలిక కూడా లేదు. అదికూడా బతికి బట్ట కట్టలేదు. ఈ దళారి రాజ్యం ఇలా మారదు బాబు, మరి కొంచెం అలోచించండి. my email id venneladaari@gmail.com

    ReplyDelete
  13. వర్మ గారు,


    "లోక్సత్తా కూడా ఒక పార్లమెంటరీ పంధను ఎంచుకున్నపార్టీయ"
    నాకు పార్లమెంటరీ పంధా లొ సమస్య కనిపించడం లేదు, కాని నా బ్లాగ్ లొ పేర్కొనట్టు, బూజు పట్టిన అ వ్యవస్ద లొ మౌలికమైన మార్పులు చాలా చేయాలి.


    "మన ఆర్ధిక వ్యవస్థను కొల్లగొట్టేందుకు ప్రపంచ బ్యాంకు వంటి వాటి ద్వారా మన మూలుగును పీల్చి పిప్పిచేసి వారి అధీనంలోకి పోయేట్లు చేస్తున్నార"
    ప్రపంచాన్ని కొల్లగొట్టేందుకు సమ్రాజ్యవాదులు ఎంచుకున్న నయా రాస్తా ప్రపంచ బ్యాంక్, ఐ.యం.యఫ్ తధితర సంస్తలు, ఈ ఉచ్చు లొ మన దేశం, మన రాష్త్రం కూడా ఉన్నాయి, మీతొ ఏకీబవిస్తాను, ఈ విషయాల లొ లొక్ సత్త వైఖరి నాకు తెలియదు.




    "వ్యవస్త ఉపిరితల రంగాలలో మార్పు తీసుకు రావడానికి నీతి పాఠాలు చెపుతున్న సూటూ బూటూ పార్టీ లోక్ సత్త"
    నేను అలా అనుకోవడం లేదు, ఒక సారి వాళ్ళ హామీల పత్రాన్ని చూడండి, కేవలం ఉపిరితలం లొ కాకుండా, ప్రతి రంగం లొ మౌలికమైన మార్పులకు కట్టుబడి ఉన్నట్టు అనిపిస్తుంది.



    "ఈ దళారి రాజ్యం ఇలా మారదు బాబు, మరి కొంచెం అలోచించండి"
    నా ప్రస్తుత అవగాహన, విశ్లేషన ప్రకారం లొక్ సత్తా సఫలం ఐతె ఐనట్టు, లేదంటె అంతర్యుదం(civil war) లాంటివేవో సంభవించక తప్పదు.

    మీ అభిప్రాయలు తెలుపగలరు

    ReplyDelete
  14. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వర్గంలో లోక్ సత్తా పార్టీ ప్రజారాజ్యం పార్టీ నుంచి ఫిరాయించిన అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. ఫిరాయింపుదార్లకి టికెట్లు ఇవ్వడం వల్ల మార్పు ఎంత వరకు తీసుకురాగలరు? శ్రీకాకుళంలో లోక్ సత్తా కార్యక్రమాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. వాళ్ళకి అంత కంటే మంచి అభ్యర్థి ఎందుకు దొరకలేదు? వర్మ గారు లోక్ సత్తా గురించి అడిగిన డౌట్లు సరైనవే.

    ReplyDelete
  15. ప్రవీణ్ గారు,

    మన లాగా మట్లాడే వాళ్ళు నిలబడక.

    ఇలాంటి పొరబాటులు చాలానే జరిగినట్టున్నాయి,కాని లొక్ సత్తా వాటిని త్వరగా అదిగమించలి.

    ReplyDelete